Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర స్థాయి గోల్డ్‌మెడల్ సాధించిన మహిళ

game

మన తెలంగాణ/నస్పూర్ : 5 కిలోమీటర్ల వా కింగ్‌లో తెలంగాణ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించిన గరిగె మాధవిని మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీరాంపూర్ జిఎం సుభాని పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలో గరిగె మాధవిని అభినందించి, మాట్లాడుతూ డి సెంబర్ 29,30 తేదీల్లో బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పో టీలలో సింగరేణి సెక్యూరిటీగాడ్ గరిగె శ్రీనివాస్ భార్య మాధవి 5 కిలోమీటర్ల వాకింగ్, 400 మీటర్ల రిలే రేస్‌లో రెండు గోల్డ్‌మెడల్ సాధించారని పేర్కొన్నారు. మాధవి గృహినగా ఉంటూ ఆరోగ్యం కో సం నిత్యం వాకింగ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర స్థా యి పోటీలలో గెలుపొంది. బెంగుళూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. మహిళలు మాధవి విజయాన్ని సూ ర్తిగా తీసుకొని ఆరోగ్యం కోసం నిత్యం వాకింగ్ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో వి జయం సాధించి, సింగరేణీయురాలిగా సింగరే ణి కీర్తిని ఇనుమటింపజేయాలన్నారు.
కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు సురేందర్‌రెడ్డి, సింగరేణి అధికారులు పివి సత్యనారాయణ, చిత్తరంజన్ కుమార్, టి. శ్రీనివాస్‌రావు, ఫని, జివి కిరణ్, ఆజ్మీర తు కారాం, సిహెచ్ అశోక్, రాజన్న, సంపత్‌కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments