అమరావతి: రైలు పట్టాలపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడిని టి.వెంకటాపురం గ్రామానికి చెందిన గింజాల స్వామిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.