Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉసురు తీసిన మసాజ్

LEG

మసాజ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు గత ఏడాది బ్యాడ్మింటన్ ఆడుతుండగా, ఎడమ కాలు విరిగింది. దీంతో అతని కాలుకు వైద్యులు కట్టుకట్టారు. అనంతరం ఆ కట్టును విప్పేశారు. కానీ నొప్పి , వాపు తగ్గకపోగా, గాయమైన చోట రక్తం గడ్డకట్టుకపోయింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. అతని బాధను చూసిన తల్లి తట్టుకోలే కొడుకు కాలుపై రక్తం గడ్డ కట్టిన చోట మసాజ్ చేసింది. దీంతో అతను స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రక్తం గడ్డ కట్టిన చోట మసాజ్ చేయడం వల్ల ఆ రక్తం ఊపిరిత్తుల వరకు చేరుకుని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తన చేతులారా తన కొడుకును చంపుకున్నానంటూ మృతుడి తల్లి చేసిన రోదనలు మిన్నంటాయి.

Comments

comments