Home మంచిర్యాల కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

A young man killed with current shock

జన్నారం: జన్నారం మండల మొర్రిగూడ గ్రామానికి చెందిన లావుడియ సుమన్(22) అనే యువకుడు శనివారం కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడని జన్నారం ఎష్‌ఐ ఫరీద్ తెలిపారు. మృతుడు సుమన్‌తో పాటు అతని స్నేహితుడు నవీన్, మధు, సురేందర్, రాజు, శ్రీనులు కలసి గ్రామ శివారులో గల వాగు పక్కన లావుడియ బద్రిబాయి వ్యవసాయ బావిలో చేపలు పట్టడానికి కరెంట్ వైర్‌ను కర్రకు కట్టి చేపల గురించి నీటిలో పెట్టారని ప్రమాదవశాత్తు మృతుడు కాలు జారీ కరెంట్ వైరు ఉన్న కర్రపై పడగా కరెంట్ వైరు ఎడమ చేయికి తాకి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. స్నేహితుల నిర్లక్షం వలన లావుడియా సుమన్ మృతి చెందాడని తండ్రి లావుడియ కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ ఫరీద్ తెలిపారు.