Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఇష్టపడిన యువతితో పెళ్లి కోసం టవరెక్కిన యువకుడు

tower
మనతెలంగాణ/సిర్పూర్(యు): తాను ఇష్టపడిన యువతితో పెళ్ళి జరిపించాలని కోరుతూ ఓ యువకుడు ట వరెక్కిన ఘటన చర్చనీయాంశంగా మా రింది. సిర్పూర్(యు)లో మంగళవారం మూడు గంటల పాటు హల్‌చల్ సృష్టించింది.సిర్పూర్(యు)కు చెందిన గౌస్ మేస్త్రి కుమారుడు షారుక్ (25) స్దానిక ంగా జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తె లిపారు. అయితే మండల కేంద్రానికి చె ందిన ఓ యువతిని తాను ఇష్టపడినట్లు , పెళ్ళి జరిపించాలని తల్లితండ్రులను కోరగా కొద్ది రోజులు ఆగాలని సూచించగా అంతటితో ఆగని ఆ యువకుడు ఏకంగా టవరెక్కి హల్‌చల్ చేశాడు. పె ళ్ళి ఒప్పందం కుదిరితేనే క్రిందికి వస్తానని మొండికేయడంతో స్దానికులు, బ ంధువులు పలువురు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జైనూర్ సిఐ సాదిక్ పాషా,ఎస్‌ఐ గౌతమ్‌లు ఘటన స్దలానికి చేరుకున్నారు.మైక్ సహయంతో టవర్ పై నున్న షారుక్‌తో మాట్లాడి అతన్ని క్రిందికి దించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. కొద్ది రోజులు ఆగాక పెళ్ళి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు యువతి ,యువకుల తల్లితండ్రులతో కౌన్సిలింగ్ నిర్వహించారు.

Comments

comments