Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

చికిత్స పొందుతూ యువతి మృతి

 A young woman was treated in hospital and died

మన తెలంగాణ/మాక్లూర్: ప్రేమ పేరుతో బిటెక్ విద్యార్థినిని మోసం చేసి గల్ఫ్ దేశం వెల్లి వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ అవమానాల పాలు చేస్తున్నాడని ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి ఐదు రోజులు నరకయాతన అనుభవించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన బిటెక్ విద్యార్థిని రాజర్ల రమ్యకృఫ్ణ (20) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్యకృష్ణ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా పూన ప్రసాద్ నిత్యం వేధిస్తూ తనను వశపర్చుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి కొందరిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, వాడికి ఉరి శిక్ష విధించాలని తన సూసైడ్ నోట్‌లో రాసింది.
నమ్మించి మోసం చేసిన క్రిమినల్ మైండ్ కలిగిన పూన ప్రసాద్ ఎక్కడ ఉన్నా రప్పించి తగిన శిక్ష విధించాలని కుటుంబీకులు, గ్రామస్తులు పోలీసులను కోరారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు రూరల్ సిఐ బుచ్చన్న, మాక్లూర్ ఎస్‌ఐ రామునాయుడు సిబ్బందితో వచ్చారు. ఆగ్రహంతో ఉన్న మృతురాలి కుటుంబీకులను సముదాయించి ఎలాంటి ఆందోళన చేయకుందా నిలువరించారు. రమ్యకృష్ణ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments