Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తాప్సీ సినిమాల ఛాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది

Aadhi Pinisetty plays a dual role in this murder mystery

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవివి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్  కష్టపడి పనిచేసింది. కెమెరా, మ్యూజిక్, ఆర్ట్, ఎడిటింగ్, కాస్టూమ్స్‌తో పాటు అన్ని క్రాఫ్ట్ వారు వంద శాతం అంకితభావంతో పనిచేశారు. ఇక తాప్సీ ఈ సినిమాకు ఓకే చెప్పకపోతే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. తన సినిమాల ఛాయిస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానికోసమైనా ఈ సినిమా ఆడుతుంది. నా బలం, నా అండ ఎంవివి సత్యనారాయణ. మా దర్శకుడు హరికి ఇది మైల్‌స్టోన్ సినిమా అవుతుంది”అని అన్నారు. కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ “ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కోన వెంకట్ రైటింగ్ ఎంత బావుంటుందో ప్లానింగ్ కూడా అంత బాగుంటుంది. ఆది ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలి”అని పేర్కొన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ముందు తాప్సీ, తర్వాత తులసి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఈ చిత్రానికి ఇంత క్రేజ్  వచ్చేది కాదు. రితికా చక్కగా నటించింది. మేమందరం నిజాయితీగా పనిచేశాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. తాప్సీ మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకముంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  నందిని రెడ్డి, దశరథ్, రాహుల్, కావ్య థాపర్, గోపీచంద్ మలినేని, బాబీ, భాస్కరభట్ల, రవి ఎర్నేని, వివేక్ కూచిబొట్ల, హరినాథ్, తులసి, రితిక తదితరులు పాల్గొన్నారు.

Comments

comments