Home తాజా వార్తలు బుర్రకథ టీజర్ విడుదల…

బుర్రకథ టీజర్ విడుదల…

Aadhi-Saikumar

హైదరాబాద్‌: హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, నైరా షా కథానాయికలుగా నటించారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న బుర్రకథ చిత్రం టీజర్‌ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. నాన్నగారూ.. నేనొక బ్రహృత్తరమైన నిర్ణయం తీసుకున్నాను.. అంటూ ఆది చెప్పే డైలాగుతో టీజర్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో  అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో ఆది కనిపిస్తారు. అభి చిలిపి కుర్రాడిగా, రామ్‌ పద్ధతిగా, భారతీయ సంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించారు.ఈ సినిమాకు  డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు.

Aadi Saikumar BurraKatha Telugu Movie Teaser  released