Home వార్తలు ఆమె కోరిక షురూ…

ఆమె కోరిక షురూ…

Aame-Korikaశ్రీ శ్రీనివాస ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై స్వాతి నాయుడు ప్రధాన పాత్రలో ఎస్‌ఆర్ మీడియా సమర్పణలో చిక్కాల సత్యనారాయణ, మత్తి రత్నాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఆమె కోరిక’. ‘ఇక కేకే కేక’ అనేది ఉపశీర్షిక. వల్లభనేని సురేష్ చౌదరి దర్శకుడు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు వల్లభనేని సురేష్ చౌదరి మాట్లా డుతూ ‘సజావుగా సాగే ఫ్యామిలీలోకి ఒక మోడలింగ్ అమ్మా యి ప్రవేశిస్తుంది. ఆతర్వాత జరిగే అద్భుతమైన సంఘటన లనే ఈ చిత్ర కథ”అని అన్నారు. రాజు, సిరిప్రియ, శ్రీశ్రీ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతః శ్రీని, చిన్నికృష్ణ, కెమెరాః ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్స్‌ః పాలాటి శ్రీనివాస్, కో-ప్రొడ్యూసర్‌ః నివాస్.జి.