Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కేజ్రీకి షాక్.. కీలక నేత రాజీనామా…!

AAP leader Ashutosh Resigns to Party
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ పార్టీ నేత అశుతోష్ షాక్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఈ ఏడాది జనవరిలో రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసిన ముగ్గురు సభ్యుల విషయంలో కొద్దికాలంగా అశుతోష్ అసంతృప్తిగా ఉన్నరని, ఈ నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అశుతోష్ మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుంది. పార్టీతో నా అనుబంధం చాలా అద్భుతం, విప్లవాత్మకంగా కొనసాగిందన్నారు. ఆ అనుబంధానికి ఇక తెరపడిందని, పార్టీకి రాజీనామా చేశానన్నారు. అంతేగాక నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం’ అని ఆయన వెల్లడించారు. అలాగే మీడియా మిత్రులకు ఓ ట్వీట్‌లో తన ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు. జర్నలిస్టు వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అశుతోష్ 2014లో ‘ఆప్’లో చేరి, పార్టీ ప్రతినిధిగా పనిచేశారు. అన్నా హజారే చేపట్టిన అవినీత వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇదిలాఉండగా అశుతోష్ రాజీనామాపై సిఎం కేజ్రీవాల్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన రాజీనామాను అంగీకరించబోమని, అది ఈ జీవితంలోనే సాధ్యంకాదని అన్నారు. ‘మీ రాజీనామాను ఎప్పుడైనా ఎలా అంగీకరిస్తాం? ఈ జన్మలో అది కుదరదు’ అని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

Comments

comments