Home మినీ సంగ్రామం పంజాబ్‌లో ఆప్.. గోవాలో హంగ్

పంజాబ్‌లో ఆప్.. గోవాలో హంగ్

హఫింగ్టన్ పోస్ట్ -సిఓటర్ సర్వే ఫలితాలు

AAP-1

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని, గోవాలో త్రిశంకు సభ వస్తుందని ఎన్నికల ముందు జరిపిన ఒక సర్వే ఫలితాలు వెల్లడిం చాయి. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న పంజాబ్, గోవా రాష్ట్రాలలో హఫింగ్టన్ పోస్ట్ – సిఓటర్ ఎన్నికల ముందు సర్వే నిర్వహించాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని, గోవాలో హంగ్ అసెంబ్లీ వస్తుందని వారు అంచనా వేశారు. పంజాబ్ అసెంబ్లీ లోని 117 సీట్లకుగాను ఆమ్ ఆద్మీ పార్టీకి 63 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 43 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. పాలకపక్షం పట్ల సహజంగా ఉండే వ్యతిరేకత ఎదుర్కొంటున్న అకాలీదళ్-బిజెపి కూట మికి కేవలం 11 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. శిరోమణి అకాలీదళ్ పంజాబ్‌లో పదేళ్లుగా అధికారంలో ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయించడంలో కీలకమైనదిగా భావించే మాల్వా ప్రాం తంలో ఆప్ ప్రభంజనం వీయగలదని సర్వేక్షణలో తేలింది.