Home తాజా వార్తలు పంజాబ్‌లో ఇవిఎంల రిగ్గింగే మమ్మల్ని ఓడించింది: కేజ్రీవాల్

పంజాబ్‌లో ఇవిఎంల రిగ్గింగే మమ్మల్ని ఓడించింది: కేజ్రీవాల్

Aravind-Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇవిఎంలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవిఎంలు ట్యాంపరింగ్‌కు గురికావడంతోనే తాము పంజాబ్‌లో 20 నుంచి 25శాతం ఓట్లు కోల్పోయామని ఆరోపించారు. చాలా చోట్ల తమ వాలంటీర్ల సంఖ్య కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు.

ఇవిఎంల్లో జరిగిన రిగ్గింగే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆప్ విజయం తథ్యమనుకున్న తమను ఎన్నికల ఫలితాలు విస్మయానికి గురిచేశాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పాయని ఆయన గుర్తు చేశారు. కానీ ఇవిఎంలో ట్యాంపరింగ్ వల్లే తమకు రావాల్సిన పావువంతు ఓట్లు అకాలీదళ్-బిజెపికి వెళ్లిపోయాయని విమర్శించారు.

‘ఉదాహరణకు శ్రీ గోవింద్‌పూర్‌లో ఆప్‌కు ఐదుగురు వాలంటీర్లు ఉండగా, వారంత తమకే ఓటు వేస్తామని చెప్పారు. కానీ అక్కడ మాకు ఒకే ఒక్క ఓటు వచ్చిందని ఇదెలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ చోట్లా ఇలాగే జరగడంతో మా ఓట్లన్నీ మరో పార్టీకి వెళ్లిపోయాయి’ అని కేజ్రీవాల్ వాపోయారు.