Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఆమె నా సోదరి కాదు : అంజలి

Anjali-Aaradhya

హైదరాబాద్ : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జర్నీ’, ‘గీతాంజలీ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న భామ అంజలి. కెరీర్ బిగినింగ్ లో అటు తమిళం, ఇటు తెలుగులో మంచి, మంచి హిట్లు అందుకున్న అంజలికి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. కాగా కొద్ది రోజుల క్రితం అంజలి సోదరి ఆరాధ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాక ఆమె ఓ ఫోటో షూట్ చేసి.. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసింది. తన సోదరి అంజలిలా కష్టపడి మంచి నటి కావడమే తన లక్ష్యమని ఆరాధ చెప్పకొచ్చింది. కాగా ఈ విషయంపై అంజలి మరోలా స్పందించింది. తనకు ఒకే సోదరి (అక్క) ఉందని, ఆమెకి కూడా పెళ్లై.. విదేశాల్లో స్థిరపడిందని తెలిపింది.

అంజలిని ఆమె పిన్ని భారతీదేవి దత్తత తీసుకొని, ఆమె సినీ కెరీర్ గురించిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కొన్ని కారణాలతో వీరిద్దరి మధ్య గొడవలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. అయితే భారతీదేవి కుమార్తె ఆరాధ్య తన చెల్లి కాదని పరోక్షంగా ఆమె చేసిన ప్రకటన.. ఇంకా వీరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఆరాధ్య ఇప్పటికే తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో చిత్రంలో నటిస్తోంది.

Comments

comments