Search
Saturday 17 November 2018
  • :
  • :

టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు!

New Record in ICC T20 Rankings

దుబాయి: తాజాగా ఐసిసి విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఆసీస్ సారథి, ఓపెనర్ ఆరోన్ ఫించ్ టీ20 ర్యాంకింగ్స్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. తొలిసారి ఫించ్ 900 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే ట్రై సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఫించ్ 391 పరుగులు చేశాడు. జింబాబ్వేపై 172 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఫించ్ 900 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే సిరీస్ ముగిసే సమయానికి 891 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు నాల్గో స్థానంలో ఉన్న ఫించ్ తన ఖాతాలో 128 పాయింట్ల వేసుకుని ప్రస్తుతం తొలి స్థానాన్ని ఆక్రమించాడు. రెండో స్థానంలో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్, మూడో స్థానంలో భారత ఆటగాడు కెఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌లో సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించిన ఓపెనర్ రోహిత్ శర్మ 11వ స్థానంలో, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీం ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తొలి స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌పై సిరీస్ విక్టరీతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన సంచలనం రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా నుంచి స్పిన్నర్ చాహల్ నాల్గో ర్యాంక్‌లో ఉన్నాడు.

Comments

comments