Search
Wednesday 14 November 2018
  • :
  • :

గ్లోబల్ ఉపగ్రహానికి అబ్దుల్ కలాం పేరు

abdul kalamహైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్ధం ఓ గ్లోబల్ ఉపగ్రహానికి ఆయన పేరు పెట్టనున్నట్టు స్పేస్ టెక్నాలజీ ఫర్ సోసైటల్ అప్లికేషన్స్ సంస్థ కానన్ ( కెనడా-యూరోపియన్-యూఎస్-ఆసియా) ఛైర్మన్ మిలింద్ పింప్రికర్ మాంట్రియల్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. భూమి పరిశీలన, ప్రకృతి విపత్తుల నష్టం తగ్గించాడానికి ఉపయోగపడేలా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రయోగించనున్న గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్‌ఆర్ ఉపగ్రహానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అబ్దుల్ కలాం భారత్‌కు మంచి రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించునందుకు గాను గ్లోబల్ శాట్ ఉపగ్రహం పేరును యూఎస్ కలాం గ్లోబల్ శాట్ గా మార్చాలని పత్రిపాదిస్తున్నట్లు తెలిపారు.

Comments

comments