Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అబ్దుల్ కలాం స్కాలర్ షిప్ టెస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

abdul-kalam-image-done-in-pచెన్నై: అఖిల భారత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఉత్తమ విద్యార్థి, స్కాలర్‌షిప్ టెస్టును దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అబ్దుల్ కలామ్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ షేక్ అలీ పేర్కొన్నారు. మే1 నిర్వహించనున్న ఈ పరీక్షలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 100 లోపు ర్యాంక్ వచ్చిన ప్రతి విద్యార్థికి నగదు బహుమతి ఇస్తామన్నారు. ఫస్ట్ ర్యాంక్‌కు లక్ష రూపాయలు, రెండో ర్యాంక్‌కు రూ. 80,000, మూడో ర్యాంక్‌కు రూ. 70,000, నాలుగో ర్యాంక్ నుంచి పదో ర్యాంక్ వరకు 60,000 పదకొండు ర్యాంక్ నుంచి 100 ర్యాంక్ వరకు పది వేల రూపాయలు బహుమతి ఇవ్వనున్నారు. వివరాలకు ఫోన్: 09700540195ను సంప్రదించాలని కోరారు.

Comments

comments