Home రాష్ట్ర వార్తలు గాంధీ మాదిరిగా కలాం జీవితం సందేశాత్మకం

గాంధీ మాదిరిగా కలాం జీవితం సందేశాత్మకం

మాజీ రాష్ట్రపతి జయంతి ఉత్సవాల్లో సిఎం కెసిఆర్

cmkcrహైదరాబాద్: తన జీవితాన్నే సందేశంగా సాగించిన జాతిపిత మహాత్మాగాంధీ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అదే రీతిలో సందేశాత్మక జీవితాన్ని గడిపారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళు లు అర్పించారు. ఇది తన వ్యక్తిగత భావన అని సిఎం పేర్కొన్నారు. కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డిఎల్‌లో గురువారం జరిగిన మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం 85వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య మంత్రి కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహనీయుడు కలాం విగ్ర హాన్ని ఆవిష్కరించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఒక వేళ తా ను తన జీవితచరిత్రను రాస్తే అందులో అబ్దుల్ కలాం ప్రస్తావన తప్పకుండా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో 2004 తర్వాత పార్లమెంటు సా క్షిగా యుపిఎ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేయబోతుందని ప్రకటిం చిన మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ఆయన గుర్తు చేశారు. డిఆ ర్‌డివో నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఏ పదవిలో ఉన్నా నిరాడంబర జీవితం సాగించిన ఆదర్శప్రాయులు అబ్దుల్ కలాం అన్నారు. ఒక అధ్యాపకునిగా, బోధకునిగా, సలహాదారుగా బ్రతికిన గొప్ప మానవతావాది అని సిఎం కొని యాడారు. శాస్త్ర పరిశోధనలను కేవలం రక్షణ పరికరాల తయారీకే కాకుం డా సామాన్యులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలను తయారు చేసేం దుకు కృషి చేశారన్నారు.

గుండె జబ్బులతో బాధపడే వారికి చవకధరకే దొ రికే స్టెంట్ తయారీ ఆవిష్కరించారన్నారు. ఆయన వ్యక్తిగతంగా సంపా దించుకున్న పేరు కన్నా దేశానికి సంపాదించిన పేరు ప్రతిష్టలే ఎక్కువగా ఉ న్నాయన్నారు. తాను కోరుకోకుండానే, ఎవరిని అడగకుండానే దేశ అత్యున్న త పదవి రాష్ట్రపతి పదవి ఆయన వద్దకు వచ్చి వరించిందన్నారు. దేశ ప్రజ లంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్రపతి కలాం అని సిఎం తెలిపారు. హైద రాబాద్‌కు కలాంకు ఉన్న సంబంధం విడదీయరానిదన్నారు. నగరంలో స్పే స్‌కు సంబంధించిన విడిభాగాల తయారీ రంగం విస్తరించడంలో కలాం పా త్ర అసామాన్యం అన్నారు. ప్రపంచంలో ఏ స్పేస్ రాకెట్ ఎగిరిన హైదరా బాద్‌లో తయారైన స్పేస్ పార్ట్ అందులో ఉంటున్నాయంటే డాక్టర్ కలాం పడిన తపన అందులో ఉందన్నారు. ఐదు రకాల క్షిపణలు తయారు చేసిన కలాం మిస్సైల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారని, దేశఖ్యాతిని ఖండాంతరా లకు వ్యాపింపజేశారన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి ప్రభుత్వాన్ని ఒప్పించి కలాం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి దేశ అణుసామర్థాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. వారు చూపించిన బాట లో దేశం కోసం, దేశంలోని పేదల కోసం రోజుకు ఒక్క నిమిషం ఆలోచిం చినా అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందన్నారు.
ఆర్‌సిఐ మిస్సైల్ కాంప్లెక్స్… పేరు ఇకపై ఆర్‌సిఐ డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం
ఆర్‌సిఐలో జరిగిన మరో కార్యక్రమంలో రీసర్చ్ సెంటర్ ఇమారత్ మిస్సైల్ కాంప్లెక్స్ పేరును రీసర్చ్ సెంటర్ ఇమారత్ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం మి స్సైల్ కాంప్లెక్స్‌గా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, చేవెళ్ల లోక్‌సభ సభ్యులు కె.విశ్వేశ్వర్‌రెడ్డి, మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డిలు పాల్గొన్నారు.