Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

‘ఛత్రపతి’పై అభిషేక్ కన్ను

 Abhishek Bachchan wishes to remake this Prabhas Chatrapathi

ఎంతో కాలంగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా సెట్స్‌పై పలు రీమేక్ సినిమాలున్నాయి. ఇప్పుడు ఓ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాపై ఓ బాలీవుడ్ హీరో కన్నుపడింది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించాలని ఉందని చెప్పాడు అభిషేక్ బచ్చన్. తాజాగా అభిషేక్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ “నేను రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చూస్తుంటాను. నాకు ప్రభాస్ ‘ఛత్రపతి’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉన్నాయి. నాకు ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించాలని ఉంది”అని అభిషేక్ అన్నాడు.

Comments

comments