Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

250కిలోల బెల్లం పట్టివేత

Abkari Police Sized 250 kg of jaggery in vikarabad

కుల్కచర్ల: నిబంధనలకుల విరుద్దంగా బెల్లాన్ని నిల్వ చేసిన వ్యక్తిపై అబ్కారి శాఖ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేసిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అబ్కారి శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కట్ట పుల్లయ్య నివాసంలో నిబంధనలకు విరుద్దంగా 250కిలోల బెల్లాన్ని నిల్వ ఉంచడం జరిగింది. అక్రమంగా బెల్లాన్ని నిల్వ ఉంచడం చట్ట రిత్యా నేరం కావున అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ చంద్రశేఖర్ పెర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా ఎవరు వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిషేదిత వస్తువుల తరలింపు, అమ్మకాలు నేరం కావున ఎవ్వరూ కూడా అట్టి నిబంధనలను అతిక్రమించరాదని ఆయన అన్నారు. కుల్కచర్ల మండలంలో బెల్లం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో లింగంపల్లి మరియు కుల్కచర్ల గ్రామాలలోని పలు దుకాణ మరియు ఇళ్ళలో దాడులు నిర్వహించడం జరిగిందని ఆయన పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ షాకీర్ అహ్మద్ అబ్కారిశాఖ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Comments

comments