Home తాజా వార్తలు అన్నపూర్ణ జిల్లాగా మారిన మహబూబ్‌నగర్

అన్నపూర్ణ జిల్లాగా మారిన మహబూబ్‌నగర్

About Mahabubnagar District

మహబూబ్ నగర్: సమైక్య పాలనలో పొట్టచేత పట్టుకుని పట్టణాలకు కూలీలుగా పోయి శవాలుగా మారిన పాలకులకు పట్టని పాలమూరు బతుకులు నాడు. సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా ఎండిపోయింది. నేడు తెలంగాణ సాధించుకున్నాక టిఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో పొలాలు పచ్చబడ్డాయి, రైతుల కళ్లలో ఆనందం కనిపించింది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, లిఫ్ట్ ఇరిగేషన్‌తో 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. దీంతో వలసల జిల్లాగా మారిన మహబూబ్ నగర్ ఇప్పుడు అన్నపూర్ణ జిల్లాగా మారింది. ‘బిడ్డా భద్రంగా ఉండు…ఇల్లు జాగర్త ముసల్ధాన్ని ఇబ్బంది పెట్టమాక… సక్కగా బడికిపో… ఏడ్వకు కొడకా… కొన్ని దినాలేగా… మళ్లీ సీజన్‌ దాటగానే వత్తం… ఈడనే ఉంటే తినడానికి ఎట్లా బువ ఎట్ల చెప్పు.. అందుకే ముంబాయి పోయి అక్కడ పనిచేసి కాసిన్ని పైసలు తెత్తె గింత బువ్వ దొరకుతది. పెళ్లీడుకొచ్చిన మీ అక్కను ఓ ఇంటి దాన్ని చేయాలి గదా బిడ్డా… అప్పటి దాకా మనకు దూరం తప్పదు నాన్న…’ జిల్లా నుండి తల్లి బిడ్డలను వదలి దూర ప్రాంతాలకు వలసలు పోతూ తమ బిడ్డలకు చెప్పిన మాటలివి. కానీ టిఆర్ఎస్ పాలనలో జిల్లా పచ్చగా మారింది. మరల దొంగల చేతిలో రాష్ర్టాన్ని పెడదామా? అంటూ పాలమూరు అభివృద్ధిపై టిఆర్‌ఎస్ పార్టీ ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను టిఆర్‌ఎస్ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది.

About Mahabubnagar District

Telangana News