Home తాజా వార్తలు ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

Air-India-Plane

కొచ్చి: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా విమానం  మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు బయలుదేరగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో  బయలుదేరిన బోయింగ్‌ 737-800 విమానం విమానాశ్రయంలోని టాక్సీవే దగ్గర పక్కకు  ఒరిగిపోయింది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.