Home జాతీయ వార్తలు అబూ సలేం ముస్తఫా దోసా దోషులే

అబూ సలేం ముస్తఫా దోసా దోషులే

  • మరో నలుగురు కూడా.. అబ్దుల్ ఖయ్యీంకి విముక్తి
  • 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా ప్రత్యేక కోర్టు తీర్పు, 19 నుండి శిక్షలు

Mustafa-Dosa

ముంబై : ముంబై పేలుళ్ల కేసు-1993లో కీలక సూత్రధారులు ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేంలను ఇక్క డి టాడా ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. టాడా చట్టం, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద దోసాపై నమోదైన కుట్ర, హత్య అభియోగాలు కోర్టు విచారణలో రుజువయ్యాయి. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్థారించింది. మరోవైపు పేలుళ్ల కోసం ఆయుధాలను గుజరా త్ నుండి ముంబైకి తరలించాడంటూ అభియోగా లెదుర్కొంటున్న సలేంని కూడా కోర్టు దోషిగా తేల్చింది. మొత్తం ఏడుగురు నిందితుల్లో దోసా, సలేంలతో పాటు కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్దిఖి, తాహీర్ మర్చంట్‌లను కోర్టు దోషులుగా తేల్చిం ది. అబ్దుల్ ఖయ్యుం షేక్‌కి మాత్రం విముక్తిని ప్రసాదించి ంది. డిఫెన్స్-ప్రాసిక్యూషన్ వాదోపవాదనలు విన్న తర్వాత టాడా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి గోవింద్ ఎ సనప్ దోషులకు శిక్షలు ఖరారు చేస్తారు. దోషిత్వం రుజువైతే సిద్దిఖి మినహా మిగిలిన వారికి మరణశిక్ష విధించబడుతుంది. కాగా, ఈ కేసులో నిందితుడైన బాలీ వుడ్ నటుడు సంజయ్ దత్‌కి సలేం ఆయుధాలను సమ కూర్చాడు. జనవరి 16, 1993న ఏకె 56 రైఫిళ్లు, 250 రౌండ్లు, కొన్ని చేతితో విసిరే గ్రెనేడ్లను తన నివాసంలో కలిగి ఉన్నందుకు దత్‌ని దర్యాప్తు సంస్థ నిందితుడిగా పేర్కొంది. రెండు రోజుల తర్వాత అంటే, జనవరి 18, 1993న సలేంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు దత్ ఇంటి నుండి రెండు రైఫిళ్లను, కొన్ని రౌండ్లను తిరిగి తీసుకెళ్లారు. అయితే భారత్-పోర్చుగల్ దేశాల మధ్య కుదుర్చుకున్న నేరస్థుల పరస్పర అప్పగింతల ఒప్పందా నికి విరుద్ధంగా ఉన్నాయంటూ దర్యాప్తు సంస్థ అప్పీలు చేయడంతో సలేంపై నమోదు చేసిన కొన్ని అభియో గాలను విచారణ కోర్టు 2013లో కొట్టివేసిన సంగతి తెలి సిందే. ఆర్‌డిఎక్స్ సహా పేలుడు పదార్థాలను భారత్‌లోకి తీసుకురావడం, పేలుళ్ల శిక్షణ కోసం కొంతమంది యువకులను పాకిస్తాన్‌కి పంపడం వెనుక దోసా ప్రధాన సూత్రధారి. టాడా కోర్టు 2007లో చేపట్టిన ఈ కేసు తొలి దశ విచారణలో మొత్తం 123 మంది నిందితుల్లో 100 మందిని దోషులుగా తేల్చి, 23 మందికి విముక్తిని ప్రసాదించింది. కాగా, ఏడుగురు నిందితులు అబూ సలేం, ముస్తఫా దోసా, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్దిఖి, తాహీర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యూం షేక్‌లు ప్రధాన కేసు విచారణకు ముగింపు దశకు చేరుకున్న సమయంలో అరెస్టయినందు వల్ల వారిపై విచారణను వేరుగా చేపట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నాయకత్వంలో నేరస్థుల ముఠా పరారీలో ఉన్న ఇతర నిందితులు టైగర్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసా భారత్‌లో తీవ్రవాద దాడుల నిర్వహణకు వ్యూహరచన చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అంతేకాక ముస్తఫా దోసా, టైగర్ మెమన్, చోటా షకీల్ ముంబైలో పేలుళ్ల నిర్వహణ కోసం పాకిస్తాన్, భారత్ లలో శిక్షణా శిబిరాలను నిర్వహించారని, ఆయుధాల వినియోగంపై శిక్షణ కోసం కొంతమంది యువకులను వారు ఇండియా నుండి దుబాయి మీదుగా పాకిస్తాన్‌కు పంపారని కూడా ప్రాసిక్యూషన్ పేర్కొంది. పేలుళ్లను జరపడానికి ముందు కుట్రదారులు 15 సార్లు సమావేశ మయ్యారని కూడా కోర్టుకు వివరించింది. కాగా, మార్చి 12, 1993న ముంబై నగరంలోని 12 చోట్ల తీవ్రవా దులు జరిపిన విచక్షణారహిత బాంబు దాడుల్లో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 713 మంది తీవ్రంగా గాయ పడ్డారు. దాదాపు రూ.27 కోట్ల మేర ఆస్తి నష్టం కూడా సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపం చంలోనే భారీ మొత్తంలో ఆర్‌డిఎక్స్ ఉపయోగించి చేసిన మొట్టమొదటి తీవ్రవాద దాడి ఇదే కావడం గమనార్హం.
ఈ నెల 19 నుండి శిక్షలు ఖరారు
ఈ కేసులో దోషులకు శిక్షల ఖరారు ప్రక్రియను ఈ నెల 19 నుండి కోర్టు ప్రారంభిస్తుందని సిబిఐ ప్రత్యేక న్యాయవాది దీపక్ సాల్వి విలేకరులకు తెలిపారు. నేరస్థులకు గరిష్ట శిక్షను విధించేలా కోర్టుకు విజ్ఞప్తి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కేసులో నిందితులెవ్వరూ కస్టడీలో లేనందు వల్ల టాడా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తాజా తీర్పే ఇప్పటికి ఆఖరిదవుతుందని ఆయన అన్నారు.