Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విద్యా ప్రమాణాల మెరుగుకు పటిష్ట చర్యలు

 academic standard Strengthening steps to improve

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్: విద్యా ప్రమాణాల మెరుగుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నఅన్నారు. శుక్రవారం మావల మండలంలోని దస్నాపూర్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఎస్సీ, బీసీ వసతి గృహాల సంక్షేమ అధికారులు, నాల్గవ తరగతి ఉద్యోగుకులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, మంచి వాతవారణం కల్పించి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మన నీళు,మన ఉద్యోగాలు ముఖ్యమంత్రి సమక్షంలో నాలుగు రోజుల తెలంగాణ దేశంలోనే ఆగ్రస్థానంలో నిలిచిందన్నారు.అలాగే రైతులకు రైతు భీమా రూ.5లక్షలు త్వరలో సీఎం కూటాయించబోతున్నారన్నారు.ఒక ఏడాదిలో లక్ష ఉద్యోగాలు సాధించుకుంటామని అలాగే మైనార్టీలకు రూ. 2 వేల కోట్లు విడుదల చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. పురాతనఆడెల్లి ఆలయాన్ని ఎవరు ఎప్పుడు చేయని అభివృద్ది తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగిందని ఇక్కడికి వచ్చే భక్తులకు తాగునీటితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఈ భగవత్‌రావు,ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్‌రామ్‌రెడ్డి,ఎఎంసి చైర్మన్ రాజ్‌మహ్మద్,ఆడెల్లి ఆలయ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ అయిటి రమేష్,మాజి ఆలయ చైర్మన్‌లు రాజేశ్వర్,మాదవరావు,మండల ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మధుకార్‌రెడ్డి,పార్టీ కన్వీనర్ రవీందర్‌రెడ్డి,ఎంపిడిఒ గుమ్ముల గంగాధర్,ఉపతహసీల్థార్ రాఘవేందర్,సర్పంచ్ మర్రి లక్ష్మి,ఎంపిటిసి లస్మవ్వ,నాయకులు రాజేందర్‌రెడ్డి,దేవిశంకర్,మల్లేష్,భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments