Home తాజా వార్తలు ఎసిబి వలలో ట్యాక్స్ అధికారి

ఎసిబి వలలో ట్యాక్స్ అధికారి

GHMC Tax inspector arrest

 

హైదరాబాద్: నగరంలోని దక్షిణ మండల జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ట్యాక్స్ అధికారి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. బాధితుడు తమకు ఫిర్యాదు చేయడంతో వల పన్ని ట్యాక్స్ అధికారిని పట్టుకున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు. బాధితుడి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు వారు చెప్పారు.  లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.

ACB arrested by GHMC Tax inspector in South zone