Home భద్రాద్రి కొత్తగూడెం ఎసిబి వలలో అవినీతి చేప

ఎసిబి వలలో అవినీతి చేప

ఏకకాలంలో పదిచోట్ల దాడులు
రూ. 2 కోట్ల విలువైన ఆస్థులు,
1 కెజి 750 గ్రాముల బంగారం స్వాధీనం!

Corruption1

కొత్తగూడెం: ఎసిబి వలకు మరో అవినీతి చేప చిక్కింది. ఏకకాలంలో పదిచోట్ల దాడులు నిర్వహించిన ఉక్కిరిబిక్కిరి చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ గౌస్ పాషాపై వచ్చిన అవినీతి ఆరోణల నేపథ్యంలో సోమవారం ఎసిబి మెరుపుదాడులు నిర్వహిం చింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో పది చోట్ల ఏకకాలంలోదాడులకు దిగింది. హైదరాబాద్, ఖమ్మం, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల సైతంఆస్థులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఖమ్మం,కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన ఐదుడుగు డిఎస్పిలు,పది మంది సిఐలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం సింగరేణిగెస్ట్‌హౌస్‌లో సోమవారం తెల్లవారుజామున ఆయనతోపాటు గౌస్‌పాషాకు చెందిన డ్రైవర్లను ఆదపులోకి తీసుకున్నారు. గౌస్‌పాషా డ్రైవర్ వద్దఉన్న రూ. 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. భార్య, కుమార్తె,అల్లుడు, కుమారులు, బినామీల పేర్ల మీద రూ. కోట్లకు పైగా స్థిరాస్థిఉన్నట్లు వారు గుర్తించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్‌పి సాయిబాబు, సూర్యనారాయణ, సుదర్శన్, అశోక్ కుమార్,సిద్ధిక్ నేతృత్వంలో దాడులునిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో సైతం తమకు చెందిన వారి ఇళ్లలో సైతం సోదాలు సాగుతున్నాయి. గౌస్ పాషా వైరాలో విధులు నిర్వహించారు. విభజనలో కొత్తగూడెం మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం వరకూ కూడా భద్రాచంలో ఇంచార్జ్‌గా విధులు నిర్వహించారు. కాగా వైరాలో పనిచేసి కాలంలో అవే రకమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ఆయన ఎసిబి సోదాలకు లోనయ్యారు.

భద్రాచలంలో పనిచేసిన సమయంలో ఇసుక ట్రాక్టర్ల, జామాయిల్ ట్రాక్టర్ల వద్ద నెలకు రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు ముడుపులు పచ్చుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అదే విధంగా లారీల నుంచి నెలకు రూ.3 వేల వరకు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పాల్వంచ కేంద్రంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో సొంతగూటిలో తలెత్తిన వివాదాల కారణంగా ఎసిబి అధికారులకు సమాచారం అందించారనే పుకార్లు వినవస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్థులను కూడగట్టినట్లు తేటతెల్లమైతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.