Home తాజా వార్తలు స్పోర్ట్స్ కోటారీ

స్పోర్ట్స్ కోటారీ

ph0

నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి మెడికల్ సీట్లు అమ్ముకున్న స్పోర్ట్ కమిటీ సభ్యులు
ఇళ్లల్లో ఎసిబి సోదాలు
శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ అరెస్టు

మన తెలంగాణ/ హైదరాబాద్ : స్పోర్ట్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణం కేసులో ‘శాట్స్’ (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్) డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం అరెస్టు చేసి జ్యుడిషియల్ రి మాండ్ (చంచల్‌గూడ జైలు)కు తరలించా రు. 201718 స్పోర్ట్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యం లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఎసిబి అధికారులు ఇటీవలే కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తెలంగాణ స్పార్ట్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించారు. శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ కార్యాలయంలోనూ, హబ్సీగూడలోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో క్రీడాకారుల కోటా కింద ‘ప్రయారిటీ’ (ప్రాధాన్యత) జాబితాకు సం బంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు లభించినట్లు ఎసిబి డైరెక్టర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. ఈ అక్రమాలకు సంబంధించి శాట్స్‌లో పనిచేస్తున్న మరో నలుగురు సిబ్బంది ఇళ్ళలోనూ, కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించినట్లు పేర్కొనింది. వెంకటరమణపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి), (2)ల కింద బుధవారమే కేసు నమోదు చేసినట్లు పేర్కొనింది. ఎల్‌బినగర్ సర్వతినగర్‌కాలనీలోని స్పోర్ట్ అథారిటీ సైక్లింగ్ (శాట్స్ అడ్మినిస్టేటర్) కోచ్ గుర్రం చంద్రారెడ్డి నివాసంలో నిర్వహించిన సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. శాట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విమలాకర్‌రావు, స్పోర్ట్ కమిటీ సభ్యురాలు (డిప్యూటీ డైరెక్టర్ సి అండ్ ఏ) శోభ ఇళ్లల్లో సైతం సోదాలు జరిగాయి. గత విద్యా సంవత్సరం (201718) తెలంగాణ స్పోర్ట్ కోటాలో మెడికల్ (ఎంబిబిఎస్, బిడిఎస్) సీట్లు అమ్ముకున్నట్లు భరత్‌చంద్రారెడ్డి, వశిష్టారాజ్‌లు ఏసిబికి ఫిర్యాదు చేశారని, క్రీడా కోటా కింద సీట్లు ఇవ్వడానికి, ప్రాధాన్యతా జాబితాలో పేరు చేర్చడానికి డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ లక్ష రూపాయల లంచం తీసుకున్నారని వారు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏసిబి డైరెక్టర్ జనరల్ కార్యాలయం పేర్కొనింది. ఈ ఫిర్యాదుకు అదనంగా శరత్‌చంద్రారెడ్డి తండ్రి సత్యనారాయణ సైతం గత నెల 25వ తేదీన మరో ఫిర్యాదు చేశారని, లక్ష రూపాయల లంచాన్ని వెంకటరమణ తీసుకున్నట్లు వివరించారని పేర్కొనింది.
ఈ ఫిర్యాదుల ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు ఎసిబి డిఎస్‌పి సత్యనారాయణ తెలిపారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన స్పోర్ట్ కమిటీ అర్హులైనవారికి అన్యాయం చేసి, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. అనర్హులకు స్పోర్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకున్నారనే అరోపణలు రావడంతో మొత్తం ఎంతమందికి ఈ తీరులో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారన్న విషయంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారికి నివేదిక సమర్పిస్తామని డిఎస్‌పి తెలిపారు. శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణను అరెస్టు చేసి ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.