Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Accelerate mahabubabad collectorate building work

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: మానుకోట జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం మహబూబాబాద్ సాలార్‌తండా వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు కెవిఎం కన్స్‌ట్రక్షన్ నిర్వహి స్తున్నందున ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆర్‌అండ్‌బి అధికారులు కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం 20ఎకరాల 31గుంటల్లో భవనాలు నిర్మిస్తున్నారని, అదనంగా మరో ఎకరంలో ఇవిఎం గోదాం నిర్మించాలని కలెక్టర్ చెప్పారు. చేపడుతున్న పనులను పరిశీలించి అత్యంత నాణ్యతతో పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేవించారు. అనంతరం జిల్లా ఎస్‌పి కార్యాలయం సుమదాయం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు నత్తనడకన జరగడంపట్ల కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి, డిఆర్‌ఓ రాంబాబు, ఆర్‌అండ్‌బి ఇఇ రాజేందర్‌నాయక డిఇ రాముడు, తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments