Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి

meeting

* గ్రామ పంచాయతీల్లో చెత్త ట్రైసైకిళ్లు కల్పించాలి
* అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగ వంతం చేసేం దుకు సమగ్రమైన ప్రణాళి కను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో మండల అభి వృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లా డుతూ వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తి గత మరుగు దొడ్లు నిర్మించుకునే విధంగా ప్రజ లను చైతన్య వంతులను చేయాలని ఆయన అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణాన్ని వేగ వంతం చేయడానికి ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని వెళ్లాల ని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో ఉన్న మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి వారిని గ్రామా లలో మరుగుదొడ్లు నిర్మిం చేందుకు పంపా లని ఆయన సూచించారు. జిల్లాలో ఉన్న వివిధ చెరువులలో చేప పిల్లలను వదిలేట ప్పుడు సరైన సైజు, సరైన లెక్క చూసు కొని మాత్రమే చెరువులలోకి వదిలి వేయాలని కలెక్టర్ సూచించారు. మండల అభివృద్ధి అధికా రులు చేపపిల్లల సైజు, లెక్క చూసు కొని సర్టిఫికెట్ పంపిన కార్యక్రమం పార దర్శకంగా జరగాలని ప్రజాప్రతి నిధులకు, అం దరికి సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రతీ గ్రామ పంచా యతీలో చెత్తను తొలగించేందుకు మూడు చక్రాల సైకిల్‌లను వినియోగించాలని, ట్రై సైకిల్‌లు నడిపే వ్యక్తికి 14వ ఫైనాన్స్ నిధు ల నుండి చెల్లి ంచాలని ఆయన సూచిం చారు. ప్రతీ వేయి జనాభా ఉన్న ప్రాంతా నికి ఒక ట్రై సైకిల్ కేటాయించాలని ఆయన సూచించారు. మండలానికి సరఫరా చేసిన ట్రై సైకిల్‌లు ఎన్నెన్ని ఉపయోగంలో ఉన్న వి, ఎన్ని చెడిపోయినవి, ఇంకా ఎన్ని అవస రమౌతాయో, అవసరమైన వాటిని ఎక్కువ ఉన్న మండలాల నుండి సర్దుబాటు చేయ డం జరుగుతుందని ఆయన తెలిపారు. గొర్రెల కొనుగోలు పంపిణీ పథకంపై లబ్ది దారులకు గొర్రెలను రీసైక్లీంగ్ చేయకుండా అవగాహన కల్పించాలని ఆయన సూచిం చారు. గొర్రెలు కొనుగోలు కార్యక్రమం నిరంత రాయంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ఫ్లాన్ గ్రౌండ్ చేసేటప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయన అన్నారు. లబ్దిదారుల ఎంపికలో అవకత వకలు జరిగినట్లైతే వారిపై చర్యలు తీసు కోవడం జరుగుతుందని మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి.
ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ ఆర్. అంజయ్య, పశుసంవర్థక శాఖ రమేష్, డీపీఓ గోపాల్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణాచారి, జిల్లా మత్యశాఖ అధికారిని చరిత, మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments