Home అంతర్జాతీయ వార్తలు చైనా బొగ్గుగనిలో ప్రమాదం … 21మంది మృతి

చైనా బొగ్గుగనిలో ప్రమాదం … 21మంది మృతి

Accident at Coal Mineబీజింగ్ : చైనా బొగ్గు గనిలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య చైనా ప్రాంతంలోని ఓ గని పైకప్పు కూలిపోవడంతో 21 మంది కూలీలు మరణించారు. షాంగ్జి ప్రావిన్సులో లిజియాగావ్  బొగ్గు గనిలో భూగర్భ ప్రాంతంలో  87 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. 19 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు. 66 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సురక్షితంగా గని నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం అనంతరం గనిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో  గనిలో మరో రెండు మృత దేహాలను వెలికి తీశారు. ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న చైనాలో ఇటువంటి  ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చైనా పోలీసులు తెలిపారు.

Accident at Coal Mine : 21 Dead