Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

స్నేహితుడికి వీడ్కోలు చెప్పి లోకాన్నే వదిలారు

ఔటర్ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం

accidentహయత్‌నగర్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్ట్ గోడ ను ఢీకొనడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న నలుగురు యువకులు సజీవ దహనమై మాంసం ముద్దలుగా మారారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున పెద్ద అంబర్‌పేట్ టోల్‌గేట్ సమీపంలో జరిగింది. స్నేహితుడికి శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘోరం చోటు చేసు కుంది. కారు అతీవేగం, పొగ మంచు, నిద్రమత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుని ఉంటుంద ని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని బెల్లంపల్లకి చెందిన శశిధర్ (25), నర్సక్కపల్లికి చెందిన రాజు (26), పరకాలకు చెందిన శివకృష్ణ (26), శ్రీకాంత్ (25) వరంగల్ పట్టణానికి చెందిన భాస్కర్ (25)లు స్నేహితులు. వీరంతా బిటెక్ చదువులు ఒకే కళాశాలలో పూర్తి చేశారు. వీరిలో భాస్కర్‌కు తమిళనాడులోని కోయంబత్తురులోని ఓ కంపెనీలో ఉద్యోగం రావడంతో అతన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికేందుకు వీరంతా కారులో ఆదివారం రాత్రి 11 గంటలకు హన్మకొండ నుంచి ఆల్టో కారులో (టిఎస్ 03 ఇఎల్ 6551) బయల్దేరారు. సోమవారం తెల్లవారు జాము 2-3 గంటల మధ్య వీరంతా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ భాస్కర్‌కు వీడ్కోలు పలికిన శివకృష్ణ, శశిధర్, రాజు, శ్రీకాంత్‌లు 4.30 గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారు జాము 5.10 గంటలకు పెద్దఅంబర్‌పేట టోల్‌గేట్‌కు అర కిలో మీటర్ దూరంలోని వేగంగా దూసుకువచ్చిన కారు కల్వర్ట్ గోడ (పారమెటల్ వాల్)కు ఢీ కొట్టింది. వెను వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఒక పక్క కారు కల్వర్ట్‌ను ఢీ కొట్టడం, ఆ తరువాత మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న నలుగురు యువకులు అపస్మారక స్థితిలో ఉండిపోయారు. కారు డోర్లు అన్నిలాక్ వేసి ఉన్నాయి. దీంతో అందరికి మంటలు వ్యాపించాయి. విషయం గమనించిన టోల్‌గేట్ సిబ్బంది హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే కారు సగానికిపైగా కాలిపోయింది. అందులో ఉన్న నలుగురు కళ్లేదుటే కాలిబూడిదయ్యారు.. సమాచారం అందుకున్న హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఘటనా స్థలానికి ఎల్‌బినగర్ డిసిపి తఫ్సీర్ ఎక్బాల్, వనస్థలిపురం ఎసిపి భాస్కర్‌గౌడ్, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐ శ్రీనులతో పాటు క్లూస్ టీం సిబ్బంది వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కాలి మాసం ముద్దయిన మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

comments