Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రమాదాలకు నిలయాలు ఈ రహదారులు

పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు
ఇబ్బందుల్లో ప్రయాణికులు

Road-Damage

మల్దకల్: మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు ప్రమాదభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా మల్దకల్ మీదుగా గద్వాల నుండి అయిజకు వెళ్లే ప్రదాన రహదారి అస్తవ్యస్థంగా మారడంతొ ప్రతి నిత్యం ఏదొ ఒకచొట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. సద్దలొనిపల్లి ,మంగంపేట వద్ద నిర్మించిన వంతెన పనులు తూతూ మంత్రంగా నిర్మించి కాంట్రాక్టర్ చేతు లు దులుపుకోవడంతొ ఇక్కడ రోడ్డు గుంతగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇంతేకాక శేషంపల్లి కాల్వవద్ద గుంతలుగా ఏర్పడి కాల్వకు గల వం తెన ఎప్పుడు కూలుతుదొ తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

ఇంతే కాక  బూడిదపాడు స్టేజి సమీపంలొ రొడ్డు గుంతలుగా ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో రాత్రి వేళ ఆదమరిస్తే పెద్దప్రమాదాలు జరిగే అవ కాశముంది. ఈ ప్రదేశంలో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలొ కలిసిపొయినా అధికారులలో మాత్రం చలనం రావడం లేదని ప్రజలు, వాహన దారులు ఆరొపించారు. అలాగే మల్దకల్, అయిజ ప్రదాన రహదారి అస్తవ్యస్తం గా మారింది. డబుల్ రోడ్డు చేయాలనే సంకల్పంతో అక్కడక్కడా కల్వర్టు పనులు జరుగుతున్నాయి త్వరలో రోడ్డు వెడల్పు చేసేందుకు అధికారులునాయకులు సి ద్దమవుతున్నట్లు తెలిసింది.

మండలంలొని పెద్దపల్లి గ్రామస్టేజి వద్ద ప్రదాన రహ దారి గుంతలు పడి అస్తవ్యస్తంగా మారింది. ఇంతే కాక రొడ్డును అక్రమంగా తవ్వకాలు జరిపినా సంబంధిత ఆర్‌అండ్‌బి అదికారులు పట్టించుకొవడం లేద ని తెలిసింది. మిషన్ భగీరథ పేరుతొ రొడ్డును ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తవ్వకాలు జరపడంతొ ఎక్కడ గుంత ఉందొ ఎక్కడ లేదొ తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది.గ్రామాలకు మంచిబిటి రొడ్లున్నా మెయిన్ రోడ్డుకు వచ్చాక రొడ్లు బాగులేక పొవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. నీలి పల్లి స్టేజి సమీపంలొ, సద్దలొనిపల్లి నుండి నేతివాని పల్లి రహదారి  రావుల చెరువు సమీ పంలొ కల్వర్టు లేక పొవడంతొ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నట్లు పలువురు వాహనదారులు వాపొయారు.

నెట్టెంపాడు ద్వారా రైతులకు నీరందించాలని కాల్వలు ఏర్పాటు చేసి మద్దెలబండ, బిజ్వారం,ఎల్కూర్,తాటి కుంట, సద్దలొనిపల్లి,పాలవాయి గ్రామాల రైతులు తమ వ్యవసాయ పంటలకు నీటిని తరలించేందుకు రొడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ తవ్వడంతొ వాహనదా రులు తమ వాహనాలను నడిపేందుకు వ్యయప్రయాసకొరుస్తున్నారు. ఈ మద్య లొ పెరిగిన రద్దీ. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొత్తజిల్లాలేర్పాటు చేయడంతొ గద్వాలకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.గద్వాలనుండి అయిజ, అయిజనుండి కర్నూల్, మంత్రాలయం వెళ్లేందుకు ప్రజలు, రైతులు, భక్తులు అదిక సంఖ్యలొ వెళ్తుంటారు. దీంతొ ఈ రొడ్డుపై వాహనాల సంఖ్య పెరిగి ప్రమాదాలు పెరిగాయి. గత ౩౦ ఏళ్ల క్రితం వేసినరొడ్డు తప్పా గద్వాల, అయిజకు కొత్తగా రొడ్డు వేసినదాఖలాలు లేవు. రహదారి పరిస్తితి దారుణంగా మారడంతొ వాహనాల రాకపొకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు వాహనదారులు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలొ రహదారులు, రొడ్లు శాఖ వారు స్పందించి రొడ్లకు మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని పలు గ్రామాల ప్రజలు కొరుతున్నారు.

Comments

comments