Home తాజా వార్తలు 2.44 శాతం పెరిగిన ఎగుమతులు

2.44 శాతం పెరిగిన ఎగుమతులు

Statistics Exports Grew

ఫిబ్రవరిలో 17 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు 

బెంగళూరు: ఫిబ్రవరిలో దేశీయ వాణిజ్య లోటు మందగించి 17 నెలల కనిష్టానికి చేరింది. బంగారం, చమురు దిగుమతులు పడిపోవడం కారణమైంది. దీంతో వాణిజ్య లోటు 9.6 బిలియన్ డాలర్లకు చేరిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎగుమతులు 2.44 శాతం పెరిగాయి. దేశీయంగా ఎగుమతులు ఫిబ్రవరిలో 26.67 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2018 సంవత్సరం ఇదే సమయంలో 26.03 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఏప్రిల్‌ఫిబ్రవరి కాలానికి గాను మొత్తంగా ఎగుమతులు 274.21 బిలియన్ డాలర్ల నుంచి 298.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

అయితే దిగుమతులు 5.4 శా తం క్షీణించాయి. గత నెలలో 36.26 బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాణిజ్య లోటు 9.6 బిలియన్లకు చేరింది. బంగారం దిగుమతులు ఫిబ్రవరి నెలలో 10.81 శాతం పడిపోయాయి. గతేడాదిలో బంగారం దిగుమతులు 2.90 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఈసారి 2.58 బి.డాలర్లకు తగ్గాయి. 2018 ఫిబ్రవరిలో దిగుమతులుఎగుమతుల మధ్య తేడా 12.3 బి.డాలర్లు ఉంటే, 2019 జనవరిలో 14.73 బి.డాలర్లు ఉంది.

According to government statistics exports grew