Search
Wednesday 14 November 2018
  • :
  • :

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

acb-arrested-in-bribe-image

చెన్నయ్ : కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని వూత్తుకోట సమీపంలోని నత్తకోయిల్‌తిప్పై గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన ఇతను ఏడు నెలల క్రితం ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ బాలిక ఆరు నెలల గర్భిణి కావడంతో అత్యాచార ఘటన వెలుగు చూసింది. తనపై తండ్రి చేసిన అత్యాచారం గురించి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

comments