Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శిరీష హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ

అనుమతించిన కోర్టు

                  Accused

హైదరాబాద్ సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రా జీవ్, శ్రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశించింది. ఈ నెల 13న శిరీష ఆత్మహత్య వార్త తెలియగానే ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడిన కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి ఆ మరుసటి రోజే రివాల్వ ర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన విష యం తెలిసిందే.

ప్రభాకర్‌రెడ్డి, శిరీష మరణాలపై పలు అనుమానాలు రావడం, ఈ ఉదంతంలో మరికొందరి ఆడియో రికార్డులు బయటపడడం తో నిందితులను మరింత లోతుగా విచారించాల ని బంజారాహిల్స్ పోలీసులు నిర్దారణకు వచ్చా రు. ఈ మేరకు చంచల్‌గూడ జైలులో జ్యూడీషి యల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు రాజీవ్, శ్రావ ణ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశా రు. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన అ నంతరం నాంపల్లి కోర్టు నిందితులను ఈ నెల 26, 27 తేదీల్లో పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఆదే శించింది.

Comments

comments