Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొత్త సిఇసిగా అచల్‌కుమార్ జ్యోతి

ACHAL

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా అచల్‌కుమార్ జ్యోతిని నియమించారు. ప్రస్తుత సిఇసి నసీమ్ జైదీ ఈనెల 6న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అచల్‌కుమార్‌ను నియమించినట్టు న్యాయశాఖ తెలిపింది. అదే రోజు అచల్ బాధ్యతలు స్వీకరిస్తారు. సాధారణ ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలం ఆరు సంవత్సరాలు. అయితే పదవిలో ఉండగానే 65ఏళ్లు వస్తే, పదవి నుంచి వైదొలుగుతారు. ప్రస్తుత సిఇసి జైదీకి ఈనెల 6వ తేదీతో 65వ పడిలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో ఆయన అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. 64 ఏళ్ల అచల్‌కుమార్ సిఇసిగా ఏడాది పాటు కొనసాగనున్నారు. 1975లో గుజరాత్ కేడర్ నుంచి ఐఎఎస్ అధికారిగా అచల్‌కుమార్ ఎంపికయ్యారు. ఆయన అనేక కీలక పదవుల్లో పని చేశారు.

 Achal Kumar Jyoti as India’s New Chief Election Commissioner

Comments

comments