Home లైఫ్ స్టైల్ ఆసిడ్ దాడులు – చట్టాలు – సమాజం

ఆసిడ్ దాడులు – చట్టాలు – సమాజం

ఆసిడ్ దాడి బారిన  పడ్డవారి బాధ  జీవితకాలం వెంటాడుతుంది.సామాజిక సంబంధాలు నెరిపేందుకు అవరోధంలా మారుతుంది.శారీరకంగా,మానసికంగా కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది.వీటిని నివారించాలంటే సమాజంలో మార్పు తీసుకురావడం,బాధితుల పట్ల సానుకూల ధృక్పథం కలిగి ఉండి వారికి అవకాశాలు కల్పించడం కూడా అవసరం…

acid-Attackఅబ్బాయి చేసిన ప్రేమ ప్రతిపాదనను అమ్మాయి తిరస్కరిస్తే, పెళ్ళిని/లైంగికపరమైన కోరికలను తీర్చడానికి నిరాకరిస్తే,భూ తగాదాలు వంటి వాటిల్లో ఎదురు తిరిగిన వారిని భయపెట్టేందుకు వాడే సాధనంగా ఆసిడ్ దాడులు జరుగుతాయని రిపోర్ట్‌లు చెబుతున్నాయి.ఇవి ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా జరుగుతూంటాయి అంటే ఎక్కువ మంది బాధితులు మహిళలే అన్నది ఆసిడ్ సర్వైవర్స్ ట్రస్ట్ ఇంటర్‌నేషనల్(ఎఎస్‌టిఐ)వారు చెబుతున్నారు.ఆసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్ ఇండియా(ఏఎస్‌ఎఫ్‌ఐ) వారి లెక్కల ప్రకారం దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది.2012లో 106 గా ఉన్నది,2013 లో 122 కాగా,2014 లో 349గా,2015లో ఈ సంఖ్య 500లకు పెరిగింది.ఐతే ఈ సంఖ్య ప్రతి సంవత్సరం 1000కి పైగానే ఉంటుంది కాని చాలా కేసులు రిపోర్ట్ కావనే అభిప్రాయం కూడా ఉంది.గ్రామాల్లో బాధితులు మరణించడం జరుగుతుంది.కొన్ని సార్లు బాధితుల దగ్గరి బంధువులు(భర్త, కుటుంబసభ్యులు) దాడిచేయడం వల్ల ఆ సంఘటనలు వెలుగులోకి రావన్న అభిప్రాయం కూడా ఉంది.
వరంగల్ కు చెందిన స్వప్నిక,ప్రణీత,2008, డిసెంబర్ 10న కాలేజీకి బైక్‌పై వెళ్లి వస్తూండగా గుర్తుతెలియని దుండగులు వారిపై ఆసిడ్‌దాడి జరిగింది.తీవ్రంగా గాయపడిన స్వప్నిక 50 శాతం పైగా కాలిన గాయాలతో, అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయకపోవడంతో,డిసెంబర్ 31న మృతి చెందింది. ప్రణీత కాలిన గాయాలతో బాధపడినా కోలుకోగలిగింది.దాడిచేసిన ఎస్ శ్రీనివాస్ అతని స్నేహితులు సంజయ్,హరికృష్ణలను ఆ తరువాత పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు.ఈ సంఘటనలో ప్రజల అభిప్రాయాలు భిన్నంగా వినిపించాయి,అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి కూడా ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది.
ఇటువంటి సంఘటనలు దేశంలోని వివిధ ప్రదేశాల్లో పునరావృతం అయినా దాడులు చేసేవారిని పెద్దగా భయపెట్టలేకపోయాయి.చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని అందరూ అభిప్రాయపడ్డారు.2013లో18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఆసిడ్ అమ్మకాలు నిషేధించాలని,ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్ కొనుగోలుదారుడు చూపిస్తేనే సంబంధిత డీలర్ వద్ద నుండి కొనుక్కునేలా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.డీలర్ సంబంధిత అమ్మకాలపై పూర్తి సమాచారాన్ని స్థానిక పోలీస్ అధికారులకు మూడురోజుల్లో అందించాలని ఆదేశించింది.ఆసిడ్ దాడులు చేసేవారిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాలు బాధితుల వైద్య అవసరాలకు మూడు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించింది.ఐతే బాధితుల తరఫున వాదించేవారు ఈ తీర్పుతో సంతృప్తి చెందలేదు.ఆసిడ్ అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని,దాడులుచేసేవారికి తీవ్రమైన శిక్షలు విధించాలని అంటూనే,దాడికి గురైనవారి సంపూర్ణ వైద్య అవసరాలను తీర్చేవిధంగా చట్టాలు రూపొందించాలి అని సూచించారు.ఎందుకంటే బాధితులు జీవించినంతకాలం వైద్య సహాయం అవసరం ఉంటుందన్నది వారి వాదన.
బంగ్లాదేశ్‌లో 2002లోనే రెండు చట్టాలను తీసుకువచ్చారు.ఒకటి ఆసిడ్ కంట్రోల్ ఆక్ట్2002,ఆసిడ్ క్రైమ్ ప్రివెన్షన్ ఆక్ట్.దీని ద్వారా దేశంలో బహిరంగాంగా ఆసిడ్ అమ్మకాలను నిషేధించారు.దేశంలోకి దిగుమతి అయ్యే ఆసిడ్ ఎవరుబడితే వారికి దొరక్కుండా కట్టుదిట్టం చేయడం జరిగింది.దీంతో పాటుగా పొరుగు దేశాలైన పాకిస్తాన్,కంబోడియా ల్లో కూడా ఎక్కువ దాడులు నమోదవ్వడంతో అక్కడా ఆసిడ్ ఎగుమతి,దిగుమతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుని, చట్టాల్లో సవరణలు చేశారు.
మన రాష్ట్రంలో ఫిబ్రవరి 2,2017న హోం శాఖా మంత్రి నాయిని నర్సింహరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చట్ట సభ సభ్యులు పాయిజన్స్ చట్టం1919 కు సవరణలు సూచించారు.ఈ సవరణ ద్వారా ఆసిడ్ దాడులు చేసేవారికి విధించే శిక్షల తీవ్రతను పెంచడం జరిగింది.
సవరణలు : 1. సెక్షన్ 6(A)- ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి/మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఈ విధమైన కేసులను దర్యాప్తు చేయవచ్చు.
2. సెక్షన్ 6(b) – దాడికి పాల్పడేవారి శిక్ష అతి తక్కువగా 10 సంవత్సరాలు,ఎక్కువగా జీవితకాల జైలుగా మార్పుచేశారు.
#. సెక్షన్ 6(c) – విచారించతగిన,నాన్ బెయిలెబుల్ కేసులుగా పరిగణించాలని సవరణలు చేసింది.
బాధితుల పూర్తి వైద్య ఖర్చులను దాడిచేసిన వారే భరించేవిధంగా సవరణలు చేసి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి,పాస్ చేయించి రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది.ఈ సవరణలకు ముందు సెక్షన్ 6 కింద మూడునెలల జైలు,500 రూపాయల జరిమానా(మొదటి నేరం అయితే),లేదంటే ఆరునెలల జైలు,1000 రూపాయల జరిమానా గా ఉండేది.