Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

యువతులపై యాసిడ్ దాడి

ACID

ఇస్లామాబాద్ : పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ముగ్గురు యువతులపై గురువారం ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. బాధితుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. మరొకరు వారి స్నేహితురాలు. ఈ యాసిడ్ దాడిలో వారి ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తనను పెళ్లి చేసుకోవాలని అక్కాచెల్లెల్లిదరిలో ఒకరికి వారి మేనమామ వరుసైన నిందితుడు ప్రపోజల్ చేశాడు. దీనికి వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ అక్కాచెల్లెళ్లు తమ స్నేహితురాలితో కలిసి గజ్‌రాత్‌లోని డంగ్‌లో ఓ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడు తన స్నేహితుడితో కలిసి వచ్చి వారిపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు డంగ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని వారు చెప్పారు.

Acid Attack on Young Women in Pak

Comments

comments