Home తాజా వార్తలు దేశ వ్యాప్తంగా మౌన ప్రదర్శన

దేశ వ్యాప్తంగా మౌన ప్రదర్శన

Gandhiji

ఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా సోమవారం ఉదయం 11గంటలకు దేశ వ్యాప్తంగా మౌన ప్రదర్శన నిర్వహించారు. 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రదేశాల్లో మౌన ప్రదర్శన చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా రహదారులపై వాహనాలను నిలిపివేశారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని బాపుఘాట్ వద్ద జాతిపితకు నివాళులు అర్పించారు.