Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాల ఎంపికలో అక్రమాలు జరిగితే చర్యలు

coll2

*జిల్లా కలెక్టర్ ఎ.దేవసేన
మనతెలంగాణ/పెద్దపల్లి:పేద ప్రజల సంక్షేమం కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక లో అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చ ర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన హెచ్చరించారు.శనివారం పెద్దపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ రకాల రుణాల లక్షాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మం జూరు చేస్తోందని,ప్రభుత్వ లక్షాన్ని నీరు కార్చే విధంగా కొన్ని పథకాలలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అనర్హు లు లబ్ధిపొందుతున్నారని అన్నారు.ఈ సారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో వి విధ పథకాలలో ప్రభుత్వం నిర్ధ్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాలు గ్రౌండింగ్ కావడం లేదని అన్నారు. ఎ క్కడ పొరపాటు జరుగుతుందో గుర్తించి అనుకున్న గడువులో గా రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు రుణాలు గ్రౌండింగ్ చేయడంలో బ్యాంకులు స్పం దించడంలేదని అధికారులు కలెక్టర్‌కు వివరించగా, బ్యాంకర్లతో చర్చించి వారితో సమన్వయం చేసుకొని ము ందుకు పోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఏ ప్రిల్ మొ దటి వారంలో పెద్దపల్లి జిల్లాలో మెగా లోన్ మేళా నిర్వహి ంచి,ఎంపికయిన లబ్ధిదారులకు రుణాలు గ్రౌం డింగ్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అం దుకు తగ్గట్టుగా సంబంధిత శాఖల అధికారులు ఈ నెల 29లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఇప్పటి వరకు గ్రౌం డింగ్ అయిన యూనిట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ప్రజలకు ఆరిక్థ ప్రయోజనం కలుగజేస్తూ వారికి స్వయం ఉపాధి అందించే పథకాలను పకడ్బందీగా అమ లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఒ ఇన్‌చార్జి పిడి ప్రేమ్‌కుమార్,జిల్లా సం క్షేమ అధికారి పద్మావతి,ఎస్‌సి కార్పొరేషన్ ఇడి భూమన్న సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

comments