Home తాజా వార్తలు ఆ కాలేజీలపై కఠిన చర్యలు : కడియం శ్రీహరి

ఆ కాలేజీలపై కఠిన చర్యలు : కడియం శ్రీహరి

Kadiam-srihari

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు కళశాలల్లో అదనపు ఫీజులు దండుకుంటున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సభలో  ప్రశ్నోత్తరాలలో భాగంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కడియం స్పందిస్తూ..  కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, విద్యార్థుల మరణాలకు కారణమవుతున్న కాలేజీలపై చర్యలు వంటి తదితర అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ఒక్క జానియర్ కాలేజీకి  స్థాపించడానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ర్యాంకుల విధానాన్ని మార్చి దాని స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టమని గుర్తు చేశారు. ఎండకాలం సెలవుల్లో సైతం తరగతులను నిర్వహిస్తున్న 190 కాలేజీలపై దాడులు జరిపామని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరుపుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.