Home వరంగల్ వరంగల్‌ను రీజనల్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు

వరంగల్‌ను రీజనల్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు

PRIME

*ప్రతిమా గ్రూప్స్ వరంగల్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముందుకు రావాలి
*మూడు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో క్యాన్సర్ ఆస్పత్రి
* రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

మనతెలంగాణ/హసన్‌పర్తి/ దామోర/ ఎన్‌జిఓస్ కాలనీ: హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్‌ను రానున్న రోజులలో రీజనల్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్  చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఆరెపల్లి క్రాస్‌రోడ్డులో ప్రతిమా గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో  క్యాన్సర్ రోగులకు అధునాతన వైద్య సేవలందించడానికి నిర్మించతలపెట్టిన ఆస్పత్రికి  భూమి పూజ కా ర్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ భూమిపూజా కార్యక్రమంలో రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్, కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్, వరంగల్ ఎంపి దయాకర్‌రావు, ఎంఎల్‌ఎలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, కొండా సురేఖ, వినయభాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమా హస్పిటల్ యాజమాన్యం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను వరంగల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని, మెడికల్ కళాశాలకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసుకోని రాబోయే రోజులలో మెడికల్ కళాశాలకు ప్రయత్నించాలని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఔట్ పేషంట్లకు ఉండడానికి వీలుగా వసతులు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.
– 2020 వరకు వరంగల్‌లో క్యాన్సర్‌ను రూపుమాపాలి: మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాల మేరకు 2020 వరకు తెలంగాణలో కనీసం వరంగల్ జిల్లాలోనైనా క్యాన్సర్ మహమ్మారిని రూపు మాపే విధంగా యాజమాన్యం వైద్య సేవలు అందించాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ప్రతిమా గ్రూపుకు సూచించారు. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు అత్యాధునికమైన వైద్య సేవలు అందించాలనే లక్షంతో క్యాన్సర్ రోగులకు అత్యాధునికమైన వైద్య సేవలు అందించాలనే లక్షంతో క్సాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి అమెరికా దేశంలో ఏవిధంగానైతే అమెరికాలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభిస్తాయో ఈ ఇనిస్టిట్యూట్‌లో అదేవిధంగా అందుబాటులో ఏర్పాటు చేయడం మంచిపరిణామమన్నారు. పేద ప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్ ఉచిత క్యాంపులు నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, 20 సంవత్సరాల క్రి తం బసవతారకం ఆస్పత్రి, అనంతరం వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించడం అధికూడా పూ ర్తిగా పల్లేటూరి వాతావరణంలో ఏర్పాట చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పక్కా ప్రణాళికతోక్యాన్సర్‌ను గుర్తించి వైద్య సేవలు అందించాలని సూచించారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోతున్నారని, ప్రతి రోజు పురుషులు 2వేల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారని, ఈమరణాలను అరికట్టడానికి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏ ర్పాటు చేసి వైద్య సేవలు అందించాలన్నారు. దక్షణ భారతదేశంలోనే ఒక గొప్ప క్యాన్సర్ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రతిమా యాజమాన్యం కృషిచేయాలని, అందుకు తగిన విధంగా సౌకర్యాలను మెరుగుపర్చుకొని వైద్య సేవలు అందిచాలని కోరారు. ప్రతిమా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ ప్రజలకు సేవలు అందించేలా నేషనల్ హైవే, అవుటర్ రింగ్‌రోడ్డు వద్ద నిర్మించడం అభినందనీయమన్నా రు. అన్నివర్గాల ప్రజలకు ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాసనసభా స్పీకర్ సిరికొండ మ ధుసూదనాచారి అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా సేవలు అందించే విధం గా చూడాలని స్పీకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిమా గ్రూప్స్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రావు, రమేష్, అవినాష్, రాహుల్‌నారాయణ తదితరులున్నారు.