Home నల్లగొండ విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు

విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు

 Activities to prevent electrical accidents

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అదేశించారు. సోమవారం కలెక్ట ర్ క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌శాఖ ఎస్ ఇ, డిఇ, ఏడిఇలతో విద్యుత్ ప్రమాదాలు, ధీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన సమగ్ర విద్యుత్ అభివృద్ది పథకం అమలుపై స మీక్షించారు.ఆయన మాట్లాడుతూ జిల్లాలో అ క్కడక్కడ విద్యుత్ ప్రమాదాలతో రైతులు, ప్రజల మృత్యువాతపడుతున్నారని, భవిష్యత్ అ లాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయడం, ట్రా న్స్‌ఫార్మర్‌ల ఇన్సులే షన్,ఫెన్సింగ్, మరమ్మతు లు చేపట్టడం వంటివి చేయాలని ఏమైనా ఫి ర్యాదులు ఉంటే వెంటనే పరి ష్కరించాలని సూ చి ంచారు. విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తక్ష సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. వర్షా కా లంలో సిబ్బంది విద్యుత్ లైన్‌లు తెగిపోయే ప్రమాదాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద బిపిఎస్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలని, నార్కట్‌పల్లి, చిట్యాల, మునుగోడు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించా లన్నారు. విద్యుత్ సమగ్ర అభివృద్ది పథకం కింద నల్లగొండ, దేవరకొండ, మునుగోడు కేంద్రాల్లో ప్రస్తుతమున్న ట్రాన్స్‌పార్మర్‌ల సామర్ధా న్ని పెంచేందుకు 100 అదనపు ట్రాన్స్‌ఫార్మ ర్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. సమావేశంలో ఎస్‌ఇ కృ ష్ణయ్య, డిఇలు శ్రీనివాస్, రుక్మారెడ్డి, వెంకటకృష్ణలు పాల్గొన్నారు.