Home కరీంనగర్ తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

singh

*నగర ప్రజలకు 24గంటలు నీరు అందిస్తాం
*నగర మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ శశాంక

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: నగర ప్రజలకు త్వరల్లో 24గంటల నీరు అందిస్తామని నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.బుధవారం నగరంలోని 42వ డివిజన్, 4వ డివిజన్ వాటర్ ట్యాంక్‌లో జరిగిన సమావేశంలో కమీషనర్ శశాంకతో కలిసి మాట్లాడారు. నగర ప్రజలకు నీరందించడంలో అధికారులదే బాధ్యత అని అన్నారు. విధుల పట్ల నిర్లక్షం చేస్తే సహించేది లేదన్నారు. నగరంలోని అ న్ని డివిజన్‌లలో నల్లా కనెక్షన్‌ల సర్వేను చేసి ట్యాంక్‌ల వా రిగా అందించాలన్నారు.
అక్రమంగా మోటార్ పంప్‌లతో నీటి చౌర్యం చేస్తే జరిమానా విధించాలని తెలిపారు. కమిషనర్ శశాంక మాట్లాడుతూ నగర ప్రజలకు సరైన సమయంలో నీటిని అందిం చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.నగరంలోని అన్ని డివిజన్‌ల్లో వాటర్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలన్నారు.నగరంలో కొనసాగుతున్న అర్బన్ మిష న్ భగీరథ పైపులైన్ పనులకు సంబంధించి సంబంధిత అ ధికారులు,కన్సెల్టెన్సీ బృందం, కాంట్రాక్టర్లతో చర్చించ డం జరిగిందన్నారు.నగర ప్రజలకు నీటి విషయంలో ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపా రు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కర్రె లింగయ్య, పెంట సత్యం,బోనాల శ్రీకాంత్, రవీందర్, చల్ల స్వరూపరాణి-హరిశంకర్, అధికారులు ఇఇ మోహన్ కుమార్, డిఇ యాదగిరి, ఏఇ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నగరంలోని 20వ డివిజన్‌లో పలు అభివృద్ది పనులకు నగ ర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ శంకుస్థాపన చేశారు. 13 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అభివృద్ధి పనుల పరిశీలన
నగరంలోని 42వ డివిజన్‌లో యూజిడి పైప్‌లైన్ పనులను నగర మేయర్ రవీందర్ సింగ్,మున్సిపల్ కమిషనర్ శశాంక్‌లు పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజిడి పైప్‌లైన్ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. పను ల్లో నాణ్యతతో లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.