Home గాసిప్స్ నటి సాయి పల్లవితో డేటింగ్‌: స్పందించిన విజయ్

నటి సాయి పల్లవితో డేటింగ్‌: స్పందించిన విజయ్

Sai-Pallavi

చెన్నై: తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌, నటి సాయి పల్లవి డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి నటించిన ‘కణం’ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై విజయ్‌ స్పందించారు.ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ… సాయి పల్లవి తనకి మంచి స్నేహితురాలని ,రాబోయే రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన అంతకన్నా లేదని, ఇలాంటి తప్పుడు వదంతులు క్రియేట్ చేయకూడదని అన్నారు. ఇలాంటి వదంతుల వల్ల రెండు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సాయి పల్లవి కూడా ఈ వార్తలపై స్పందిస్తూ.. తన గురించి అర్థంలేని విషయాలు రాస్తే మీడియా వర్గాలపై దావా వేస్తానని అన్నట్లు సమాచారం.

 Actor AL Vijay Responding On  Actress Sai Pallavi dating