Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బెనర్జీకి పితృ వియోగం

ph

సీనియర్ నటుడు బెనర్జీ తండ్రి, నటుడు రాఘవ య్య (86) ఆదివారం ఉదయం గుండె సంబంధి త వ్యాధితో మృతిచెందారు. ఆయనకు కొడుకు బెనర్జీ తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కుమార్తె ప్రస్తుతం చెన్నైలో స్థిరపడ్డారు. రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నారు. మద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా అటునుంచి హైదరాబాద్‌కు తరలిన క్రమంలోనూ సినీ రంగంలో నటుడిగా కొనసాగారు. ‘బ్రహ్మచారి’ సినిమాతో కెరీర్ ప్రారంబించిన ఆయన వందలాది చిత్రాల్లో నటించారు. ఇటీవల కాలంలో వీరాంజనేయ, కథానాయకుడు, యమ గోల చిత్రాల్లో ఆయన నటించారు. ఈనెల 20న రిలీజవుతు న్న ‘భరత్ అనే నేను’ చిత్రంలోనూ ఆయన ఓ పాత్రలో నటించారు. బెనర్జీ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ (మా)లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణవార్త విన్న అనంతరం ‘మా’ బృందం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేసింది.

Comments

comments