Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యాక్షన్‌తో కూడిన ప్రేమ కథ

Actor Devaraj Son Prajwal Devaraj's Movie Launch

కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా ‘వైరం’ చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సాయి శివన్ దర్శకత్వంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున పిక్చర్స్ పతాకంపై జెఎంకె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి సీనియర్ దర్శకుడు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. వి.ఎన్. ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా శ్రీవాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దేవరాజ్ మాట్లాడుతూ “నేను కన్నడంతో పాటు తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి నంది అవార్డు అందుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయి ప్రణమ్ దేవరాజ్‌ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తున్నాను. నాపై చూపించిన అభిమానాన్ని తనపై కూడా చూ పిస్తారని ఆశిస్తున్నాను”అని అన్నారు.

దర్శకుడు సాయి శివన్ మాట్లాడుతూ “చక్కని ప్రేమ కథతో పాటు పక్కా యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. హీరోకు సరిపోయే కథ ఇది. ఏక కాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తాం”అని పేర్కొన్నారు. హీరో ప్రణమ్ దేవరాజ్ మాట్లాడుతూ “కన్నడలో ‘కుమారి 21ఎఫ్’ రీమేక్‌లో నటించాను. ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయి  హీరోగా నన్ను నిలబెట్టింది. ఇప్పుడు యాక్షన్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో చక్కని ప్రేమ కథ కూడా ఉంది”అని తెలిపారు. నిర్మాత జెఎంకె మాట్లాడుతూ “మా బ్యానర్‌లో తొలి సినిమా ఇది. వచ్చే నెల మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్, బెంగుళూర్ ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం”అని అన్నారు. విన్ను మద్దిపాటి, స్వప్న, మల్లిఖార్జున, శత్రు, ప్రమోదిని, కాశీ విశ్వనాథ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః గోపీనాథ్, సంగీతంః సాగర్ మహతి, ఆర్ట్‌ః పి.వి.రాజు.

Comments

comments