Home తాజా వార్తలు సైరాలో వీరారెడ్డిగా జగపతిబాబు (వీడియో)

సైరాలో వీరారెడ్డిగా జగపతిబాబు (వీడియో)

Syeraaటాలీవుడ్  : మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు చక్కగా ఒదిగిపోయినట్టు ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే అర్ధమవుతుంది. సైరాలో నటిస్తున్న బిగ్ బి అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా తదితరుల పాత్రలకు సంబంధించిన లుక్స్ ను ఇప్పటివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే.  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Actor Jagapathi Babu First Look in Syeraa Film