Home తాజా వార్తలు నాగార్జున … నన్ను కొట్టారు…

నాగార్జున … నన్ను కొట్టారు…

Actor JD Chakravarthyహైదరాబాద్ : ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనను కొట్టారని నటుడు జెడి చక్రవర్తి చెప్పారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో జెడి చక్రవర్తి నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్లను పాతబస్తీలోన ఓ ఇరానీ కేఫ్ లో నాగార్జునకు, జెడి చక్రవర్తికి మధ్య తీయాలని వర్మ నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని జెడి చక్రవర్తకి వర్మ చెప్పలేదు. తాను ఇరానీ కేఫ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగార్జున లోపలికి వస్తున్నారని, ఆయనకి తన భుజం తగిలిందని జెడి చక్రవర్తి చెప్పారు. చూసుకొని నడవాలంటూ నాగార్జున తనకు వార్నింగ్ ఇచ్చారని, సారీ చెప్పాలని నాగార్జున అనడంతో తాను పట్టించుకోలేదని, మర్యాదగా మాట్లాడాలని నాగార్జునకు సూచించానని, దీంతో ఆయన కోపానికి గురయ్యారని జెడి చక్రవర్తి తెలిపారు. దీంతో ఆయన లాగిపెట్టి తనను కొట్టారని, కిందపడిపోయిన తాను లేచి నాగార్జున కాలర్ పట్టుకుంటున్నానని, ఇంతలో నాగార్జున మనుషులు వచ్చి తనను కొట్టబోతే నాగార్జున అడ్డకున్నారని, ఇది శివ సినిమా షూటింగ్ ఫైట్ సీన్ అంటూ నాగార్జున చెప్పారని జెడి చక్రవర్తి వెల్లడించారు. రియలిస్టిక్ ఉండాలన్న ఆలోచనతోనే దర్శకుడు వర్మ ఇలా ప్లాన్ చేశారని అప్పుడు తనకు అర్ధమైందని జెడి చక్రవర్తి చెప్పారు.

Actor JD Chakravarthy Comments On Hero Nagarjuna