Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కేరళకు కమల్‌హాసన్ రూ.25లక్షల విరాళం

Actor Kamal Haasan Donates Rs25 Lakh to Kerala

చెన్నయ్ : విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ కేరళ సిఎం సహాయ నిధికి రూ.25లక్షల విరాళం ఇచ్చారు. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్ భూరీ విరాళం అందించినట్టు కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 186 మంది మరణించినట్టు అధికారులు చెప్పారు. కేరళ పరిస్థితిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సిఎం సహాయ నిధికి విరాళాలు అందించారు. నటులు సూర్య, కార్తి, విజయ్ దేవరకొండ తదితరులు విరాళాలు అందించిన వారిలో ఉన్నారు. నటుడు విశాల్ కూడా వరద బాధితుల కోసం అత్యవసర వస్తువులను సేకరించి, పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కేరళ రాష్ట్రానికి తక్షణ సహాయంగా కేంద్రం వంద కోట్లు ప్రకటించింది. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నాలుగు లక్షల రూపాయలు, ఇళ్ల కోల్పోయిన వారికి పది లక్షల రూపాయలను పరిహారంగా ఇవ్వనున్నట్టు సిఎం విజయన్ వెల్లడించారు. అంతేకాదు స్వచ్ఛందంగా సిఎం సహాయ నిధి నుంచి బాధితులకు లక్ష రూపాయలను పరిహారంగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. యావత్ భారత్ కేరళ ప్రజలకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Actor Kamal Haasan Donates Rs25 Lakh to Kerala

Comments

comments