Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వైఎస్ బయోపిక్‌లో మమ్ముట్టి

YS

హైదరాబాద్ : దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. వైఎస్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రాజశేఖర్‌తో వైఎస్ బయోపిక్ తీయాలని భావించినట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. ఆనందో బ్రహ్మ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన మహి.వి.రాఘవ్ వైఎస్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారట. ఈ సినిమా తీసేందుకు వైఎస్ తనయుడు, వైసిపి అధినేత జగన్ కూడా అంగీకరించారన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రాఘవ్ వెల్లడించనున్నారట. టాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం మొదలైంది. విశ్వ విఖ్యాత నటుడు ఎన్‌టిఆర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిపిందే. మరో పక్క హీరో బాలకృష్ణ తేజ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ బయోపిక్‌ను సినిమాగా తీస్తున్నారు. నటి సావిత్రి జీవితాధారంగా మహానటి సినిమా రాబోతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి హీరోగా సైరా … నరసింహారెడ్డి సినిమా రానుంది.

Actor Mammootty In YS Biopic

Comments

comments